‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌కు 72 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌కు 72 అర్జీలు

Mar 3 2026 9:36 AM | Updated on Mar 3 2026 9:36 AM

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌కు 72 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. టౌన్‌ ప్లానింగ్‌కు 35, ఇంజనీరింగ్‌ 18, రెవెన్యూ 8, హెల్త్‌–శానిటేషన్‌ 9, నీటి సరఫరా విభాగానికి 2 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్న రాణి, టీఓ రామకృష్ణ, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఏసీపీలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.

అర్జీల్లో కొన్ని..

● భవానీ నగర్‌లో 2–6–1381 ఇంటికి ఆరు నెలల నుంచి నల్లా నీరు రావట్లేదని విన్నవించారు.

● ఎల్‌బీనగర్‌లో రోడ్డు విస్తరించి, అభివృద్ధి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● వరంగల్‌ గాంధీనగర్‌ 11–8–38 తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు లేక చీకట్లో మగ్గుతున్నామని ఏర్పాటు చేయాలని కాలనీవాసులు విన్నవించారు.

● హనుమకొండ స్నేహనగర్‌ 2–9–307 డ్రెయినేజీ అస్తవ్యస్థంగా మారిందని, నూతనంగా నిర్మించాలని కాలనీవాసులు కోరారు.

● హనుమకొండ సదాశివ కాలనీలో రోడ్డు నంబరు 1, 6, 8లో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ వేల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విన్నవించారు.

● గోపాల్‌పూర్‌లోని రోడ్డు నంబరు 6, 7 నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కాలనీవాసులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement