న్యూస్‌రీల్
హన్మకొండ కల్చ రల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం సినీనటుడు రచ్చ రవి సందర్శించి అమ్మవారి సన్నిధిలో తాను రాసిన ‘నీ రుణం తీరేది ఎట్ల?’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం రచ్చ రవికి అర్చకులు తీర్థప్రసాదాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎంజీఎం: రిటైల్ మందుల వ్యాపారులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే మందులు విక్రయించాలని డ్రగ్ కంట్రోల్ శాఖ వరంగల్ ఏడీ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి సూచించారు. సరైన డ్రగ్ లైసెన్స్ ఉన్న రిటైల్ సంస్థలకు హోల్‌సేల్ వ్యాపారులు విక్రయించాలని పేర్కొన్నారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ మందులను విక్రయించరాదని వివరించారు. ఏదైనా మెడికల్ షాపు ఆర్‌ఎంపీలకు మందులు విక్రయిస్తే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 596 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 19,821 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. వారిలో 19,225 మంది (97 శాతం) హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు.
వరంగల్ క్రైం: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వరంగల్ సైబర్ క్రైమ్ ఏసీపీ కల్కోట గిరికుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి కేయూ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఏసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఇన్‌న్‌స్పెక్టర్ కె.అశోక్, షీ టీమ్స్ ఇన్‌స్పెక్టర్ సువర్ణ, ఎస్సైలు శివ, చరణ్, మహిళా ఎస్సైలు, మహిళా కానిస్టేబుళ్లు, సైబర్ క్రైమ్ సిబ్బంది, ఎన్‌సీసీ విద్యార్థినులు పాల్గొన్నారు.
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు ఈసీజన్‌లో మొదటిసారిగా 50 వేల వరకు మిర్చి బస్తాలు విక్రయించేందుకు రైతులు యార్డుకు తీసుకొచ్చారు. శనివారం యార్డు బంద్, ఆదివారం వారంతపు బంద్ కావడంతో సోమవారం భారీగా మిర్చిని తీసుకొచ్చారు. తేజ, యూఎస్–341 రకానికి చెందిన మిర్చిని రైతులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చారు. ఇందులో క్వింటా మిర్చి తేజ రకానికి గరిష్టంగా రూ.19,500, యూఎస్–341కు రూ.21,600, వండర్ హాట్‌కు రూ.35,000, దేశీ రకానికి రూ.42 వేలు, ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో కండక్టర్, డ్రైవర్ పోస్టులను అవుట్ సోర్సింగ్‌కింద తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఏజెన్సీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా.. ఒక్కో ఉ ద్యోగానికి రేటు కడుతున్నా యా.. ఇందుకోసం దళారులను నియమించుకుని నిరుద్యోగులనుంచి బేరసారాలకు దిగుతున్నాయా... ఇందుకు సంస్థలోని కొందరు ఉద్యోగులు సహకారం అందిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏ డిపోలో ఏయే పోస్టులు ఎన్ని భర్తీ చేస్తున్నారో కనీసం నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఇష్టానుసారంగా నియామకాలు చేపడుతున్న తీరు ఇందుకు నిదర్శనమన్న టాక్ వినిపిస్తోంది. పోస్టుల సంఖ్య బయటకు తెలిస్తే తమ ఆటలు సాగవని భావించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు.. ముందస్తు ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులను మేనేజ్ చేస్తున్నట్లు సంస్థ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
వివాదాస్పదంగా నియామకాలు..
వరంగల్ రీజియన్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ ని యామకాలు వివాదాస్పదం అవుతున్నాయి. రిటైర్ ్డ అయిన వారిస్థానంలో.. కొత్తగా అవసరం మేరకు ఉద్యోగ నియామకాలన్నీ అవుట్‌సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ కార్యాలయం కేంద్రంగా ఈ నియామకాలు సాగుతుంటాయి. ఈ కార్యాలయంలోని పర్సనల్ విభాగంలోని ఓ ఉద్యోగి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రతినిధులు వస్తే వారిని ‘అన్న’ అంటూ రాచమర్యాదలు చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అద్దెబస్సు డ్రైవర్ల వివరాలు ‘ఉప్పులా’ అందిస్తున్నాడని ఆరోపణలున్నాయి. అదే విధంగా ఓ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏకంగా గతంలో అద్దె బస్సుపై డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని దళారీగా నియమించుకుని అద్దెబస్సు డ్రైవర్లకు గాలం వేస్తున్నాడని సమాచారం. రెగ్యులర్ నియామకాల్లో అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకు ప్రాధాన్యత ఉంటుందని, తర్వాత పర్మనెంట్ చేయిస్తామని ఆశ చూపుతూ, వారినుంచి రూ.20 నుంచి 50 వేల వరకు వసూళ్లు చేస్తూ అవుట్ సోర్సింగ్ డ్రైవర్‌గా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఏజెన్సీకి ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ విభాగం ఉద్యోగి ఒకరు అద్దెబస్సు డ్రైవర్ల జాబితాను అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాను ముందు పెట్టుకుని ఏజెన్సీ నిర్వాహకులు.. దళారీ ద్వారా అద్దెబస్సు డ్రైవర్లను పిలిపించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సహకరించిన ఉద్యోగులు, అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారనే ఆరోపణలు ఆర్టీసీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి
ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు..
ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్, డ్రైవర్లను తీసుకుంటున్నాం. ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు, అవినీతికి పాల్పడినట్లు, మామూళ్లు తీసుకున్నట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– డి.విజయభాను, ఆర్‌ఎం, వరంగల్
వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
కాశిబుగ్గ: గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, ఈ టీకా బాలికలకు రక్షలాంటిదని వరంగల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశిరావు తెలిపారు. వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 – 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. అర్హత గల ఆడపిల్లలు తప్పనిసరిగా యు విన్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మిదేవి, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ స్వరూప, డాక్టర్ స్వర్ణసుధ, ఆర్‌ఎంఓ డాక్టర్ మురళి, డాక్టర్ దిలీప్‌కుమార్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం మాజీ మావోయిస్టులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అమరులైన మావోయిస్టుల కుటుంబాలకు అండగా ఉండాలని, అజ్ఞాతంలో ఉన్న మావోలు జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబంతో జీవనం సాగించాలని తదితర అంశాలపై చర్చించుకున్నారు. కార్యక్రమంలో తక్కళ్లపెల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, రాజమన్ భాస్కర్, వెంకటేశ్, శ్యామ్, రజిత పాల్గొన్నారు. – కాజీపేట అర్బన్
పలువురు అధికారుల సహకారం?
వరంగల్ రీజియన్‌లోని ఓ రెండు డిపోల్లో మంచిస్థాయిలో ఉన్న అధికారులు ఏజెన్సీలకు సంపూర్ణగా సహకరిస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. వీరి కనుసన్నల్లోనే అవుట్ సో ర్సింగ్ నియామకాలు జరుగుతున్నాయని తెలి సింది. హనుమకొండ జిల్లాలోని ఓ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న డిపోతోపాటు, ఉద్యమ నేత పేరుతో ఉన్న జిల్లాలోని ఓ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు అవినీతి, అక్రమార్జనకు అలవాటు పడి నిరుద్యోగుల అవసరాలను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సొమ్ము చేసుకుంటున్నారని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కండక్టర్ నియామకం కోసం రూ.20 వేల నుంచి 80 వేల వరకు, లేదా ముందుగా రూ.20 వేలు తీసు కోవడంతోపాటు నియామకమైన తర్వాత మూ డు నెలల జీతం ఏజెన్సీలు తీసుకుంటున్నాయని ప్రచారం ఉంది. యాజమాన్యం స్పందించి నియమకాలపై విచారణ జరిపించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
అవసరం మేరకు కొత్తవారి నియామకం
అన్నీ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ..
ఏజెన్సీలకు ‘సహకారం’ అందిస్తున్న సంస్థ ఉద్యోగులు!
వరంగల్ రీజినల్ కార్యాలయం కేంద్రంగా అక్రమాలు?


