● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
● అధికారులతో సమీక్ష
హన్మకొండ అర్బన్: వేసవిని దృష్టిలో ఉంచుకుని హనుమకొండ జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా గత వేసవిలో జరిగిన నీటి వినియోగం, ఎల్‌ఎండీ నుంచి నీటి అందుబాటు, చలివాగు నుంచి ధర్మసాగర్ పంప్ హౌస్‌కు నీటి పంపింగ్, అక్కడి నుంచి జిల్లాకు నీటి సరఫరా వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. మిషన్ భగీరథ ఎస్‌ఈ చలమారెడ్డి, ఈఈలు రామాంజనేయులు, రామ్ కుమార్, గాయత్రి, డీఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు
ఐడీఓసీలో కలెక్టర్ తనిఖీలు
కలెక్టరేట్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని వివిధ విభాగాలు, మొదటి అంతస్తులోని ముఖ్య ప్రణాళిక శాఖ, భూసర్వే, కొలతల శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఖజానా శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా పరిశ్రమల కేంద్రం, పౌర సరఫరాల శాఖ, ఈ–డిస్ట్రిక్ట్ విభాగం, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, పరిపాలన విభాగ తదితర కార్యాలయాలను కలెక్టర్ చాహత్ సందర్శించారు. అక్కడి అధికారులు, సిబ్బంది హాజరు, విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, పరిపాలన అధికారి గౌరీశంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


