పదవి బాధ్యత.. అలంకారం కాదు | - | Sakshi
Sakshi News home page

పదవి బాధ్యత.. అలంకారం కాదు

Mar 13 2026 9:03 AM | Updated on Mar 13 2026 9:03 AM

హాజరుకాని ఎమ్మెల్యేలు..

ఇదిలా ఉండగా శిక్షణ కార్యక్రమానికి నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దొంతి మాధవరె డ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు హాజరు కాకపోవ డం చర్చనీయాంశంగా మారింది. మంత్రి వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

గీసుకొండ: ‘పదవి అనేది బాధ్యత.. అంతేకాని అ లంకారం కాదు.. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజ ల్లో ఉండి వారి సమస్యలు తీర్చడానికి కృషిచేసి ఎ న్నటికీ గుర్తుండిపోయేలా సేవలు అందించాలి’ అ ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలోని మరి యపురం శివారులోని ఎస్‌ఎస్‌ గార్డెన్స్‌లో జిల్లాలోని సర్పంచ్‌లు, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేట ర్లు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్‌ కౌన్సిలర్లకు ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై గురువారం ఒక ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళా సర్పంచ్‌లు భర్త చాటు భార్యలుగా ఉండవద్దని, వారి అభిప్రాయాలు గౌరవిస్తూనే ముందుకు సాగా లని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెబు తారని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలని సూచించారు. ఏదో దోచుకుందాం అని వచ్చే వారు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. సమావేశంలో గ్రేటర్‌ వరంగల్‌ నగర మేయ ర్‌ గుండు సుధారాణి, వర్ధన్నపేట, నర్సంపేట ము న్సిపల్‌ చైర్మన్లు సారంగపాణి, పెండ్యాల లక్ష్మి, డీసీ పీ అంకిత్‌కుమార్‌, డీఎఫ్‌ఓ అనూజ్‌ అగర్వాల్‌, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, గీసుకొండ తహసీల్దార్‌ రియాజుద్దీన్‌, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ శ్రీనివా స్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా, ఇటీవల మరణించిన గంగదేవిపల్లి మాజీ స ర్పంచ్‌ కూసం రాజమౌళికి ప్రతినిధులు, అధికారులు మౌ నం పాటించి నివాళులర్పించారు. అంతకు ముందు పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌, ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలించి అభినందించారు. సర్పంచ్‌లకు గుర్తింపు కార్డులను అందించారు.

రాష్ట్ర అటవీ, పర్యావరణ,

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement