వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

May 15 2026 9:50 AM | Updated on May 15 2026 9:50 AM

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

సంక్షిప్త సమాచారం

ధర్మసాగర్‌ : తెలంగాణ రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు బుధవారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ మేరకు జాక్‌ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు తెలిపారు. జాక్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ పుట్ట మహేందర్‌రావు, రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు రుక్ముద్దీన్‌, సుమన్‌, నరేశ్‌, మహబూబాబాద్‌ జిల్లా జాక్‌ సభ్యుడు ఉమాకర్‌, హిమకర్‌, పవన్‌ కలిసిన వారిలో ఉన్నారు.

పరామర్శ

దామెర : మండలంలోని ఊరుగొండ మాజీ సర్పంచ్‌ గోగుల సత్యనారాయణరెడ్డిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పరామర్శించారు. సత్యనారాయణరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ధర్మారెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ వైస్‌ ఎంపీపీ జాకిర్‌అలీ, నాయకులు సునీల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డితో పాటు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాద బాధితుడికి చేయూత

భీమదేవరపల్లి : ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముల్కనూరు గ్రామానికి చెందిన అభిలాష్‌కు సరస్వతి శిశుమందిర్‌ పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. అభిలాష్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న 2004–05 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు మానవత్వంతో తలోకొంత జమ చేసి రూ.32 వేలు నగదును కుటుంబ సభ్యులకు అందించారు. కష్టకాలంలో ఆర్థికసాయం అందించిన శిశుమందిర్‌ పూర్వ విద్యార్థులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సొంత ఖర్చుతో

రెండు బోర్లు ఏర్పాటు

భీమదేవరపల్లి : మండలంలోని గట్ల నర్సింగపూర్‌ గ్రామానికి చెందిన కావేరి సీడ్స్‌ అధినేత గుండవరం వెంకటభాస్కర్‌రావు సొంత డబ్బుతో గ్రామంలో రెండు బోర్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు కాలనీలకు చెందిన ప్రజలకు సరిపడా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్‌ బొల్లంపల్లి అజయ్‌కుమార్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన వెంకటభాస్కర్‌రావు వెంటనే రెండు బోర్లు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మోటర్లు ఏర్పాటు చేయించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని సొంతంగా బోర్లు ఏర్పాటు చేసినందుకు సర్పంచ్‌ అజయ్‌కుమార్‌, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి మధు, వార్డు సభ్యులు షెడ్రిక్‌, ఐలయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement