మామునూరు: ప్రకృతి సిద్ధమైన సేంద్రియ సాగుపై రైతులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. నేల స్వభావంతోనే పంట దిగుబడితోపాటు ఎరువుల ఖర్చులు తగ్గించుకోవచ్చునన్నారు. పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం బొల్లికుంట క్లస్టర్ రైతు భ వనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారి విజ్ఞాన్ అధ్యక్షతన రైతు వారో త్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ రసాయన ఎ రువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. అనంతరం వ్యవసాయ అధికారి విజ్ఞాన్ మాట్లాడుతూ నానో యూరియా వాడకం, ఎరువుల సమతుల్యం విని యోగంపై అవగాహన కల్పించారు. పశువైద్యుడు కిరణ్, ఏఈఓ సత్యప్రకాశ్, రైతులు పాల్గొన్నారు.


