అక్కున చేర్చుకుంటున్న వినోదమ్మ
అనాథలకు
అమ్మ
కాజీపేట–హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కడిపికొండ బ్రిడ్జి మీదుగా ఖమ్మం బైపాస్ రోడ్డుపై నిత్యం భారీ వాహనాలు వేగంగా వెళ్తున్నాయి.
పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలి..
పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.
జఫర్‌గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు.


