సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లు

May 10 2026 7:28 AM | Updated on May 10 2026 7:28 AM

సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లు

కాజీపేట రూరల్‌: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆదివారం కాజీపేట జంక్షన్‌ మీదుగా సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల–సికింద్రాబాద్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ మంచిర్యాలలో ఉదయం 10–30 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్‌కు మధ్యాహ్నం 12–45 గంటలకు చేరుకొని వెళ్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మధిర–సికింద్రాబాద్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట జంక్షన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకొని వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక రైళ్లలో తరలివెళ్లనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement