కేయూ, సైంట్‌ సంస్థకు మధ్య ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

కేయూ, సైంట్‌ సంస్థకు మధ్య ఎంఓయూ

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

కేయూ, సైంట్‌ సంస్థకు మధ్య ఎంఓయూ

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీకి, సైంట్‌ లిమిటెడ్‌ సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం కోసం మంగళవారం యూనివర్సిటీలో చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ సైంట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి బృందం కేయూను సందర్శించింది. అకడమిక్‌ కమిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆసంస్థ హెడ్‌ కార్పొరేట్‌ ఫంక్షన్స్‌ డాక్టర్‌ పీఎన్‌ఎస్‌ వి.నరసింహం, సీనియర్‌ లీడర్‌ ఎం.సునీల్‌కుమార్‌, సీనియర్‌ డైరెక్టర్‌ కృష్ణదేవి, డైరెక్టర్‌ గీత విద్యాశాఖ ప్రతినిధి రియాసుమన్‌ పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి, వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం, ఓఎస్డీ వెంకట్రామ్‌రెడ్డి, రూసా నోడల్‌ అధికారి మల్లికార్జున్‌రెడ్డి, కేయూ పాలక మండలి సభ్యులతో చర్చించారు. పీజీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, కామర్స్‌ తదతర విభాగాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్‌ వర్క్‌లు స్టార్టప్‌సంస్థల స్థాపనకు అవసరమైన నైపుణ్యాల కల్పనకు ఉన్న అవకాశాలను బృందంతో చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement