ప్రజావాణిలో హనుమకొండ కలెక్టర్ చాహత్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. పాత ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసిన అర్జీలను తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 126 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం నూతన ప్రజావాణి పోర్టల్‌కు సంబంధించిన అంశాలను ఈడీఎం శ్రీధర్ కలెక్టర్ సమక్షంలో అధికారులకు వివరించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జీడబ్ల్యూఎంసీ సీహెచ్‌ఓ రాజారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు సత్వరమే పరిష్కరించండి:
వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 121 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ 31, నర్సంపేటలో 14 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీపీఓ కల్పన, డీఆర్‌డీఓ నాగపద్మజ, హౌసింగ్ పీడీ దామోదర్, అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు వారసత్వంగా రావాల్సిన అసైన్డ్ భూమికి జీపీఓ, ఆర్‌ఐలు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని నర్సక్కపెల్లికి చెందిన రవికుమార్, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి తమకు న్యాయం చేయాలని తిరుమలాయపల్లి గ్రామస్తులు వినతిపత్రాలు ఇచ్చారు.


