పరకాల : మహిళలు అన్ని రంగాల్లో రాణించడంతో పాటు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం అవడమే పోచంపల్లి ఫౌండేషన్ లక్ష్యమని పోచంపల్లి ఫౌండేషన్ నిర్వహకులు కొక్కిరాల రాకేష్‌రావు, చందా కుమారస్వామి అన్నారు. అందులో భాగంగానే పట్టణంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో బుధవారం కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు. 45 రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి, కొక్కిరాల దీప్తి, బీఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, భగవాన్‌రెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.


