రేవంత్‌రెడ్డిని గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను గోస పెడుతూ 40 ఏళ్ల నాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల దగ్గరే పంట కొనుగోలు చేయగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎంత ఇస్తావంటూ అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు నా చాలెంజ్.. రైతు మేళాను రైతుల మార్కెట్‌లో పెట్టండి.. ఉరికిచ్చి కొడతారు.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి
కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం
పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలన రైతుల పాలిట రాబందుల పాలనగా మారింది. రైతులను గోస పెట్టుకుంటున్న రేవంత్ పాలన పోయి అన్నం పండించే రైతు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసే బీఆర్‌ఎస్ పాలన రావాలి. పడించిన పంటలో పావలా వంతు కూడా కొనకుండా రైతులను అరిగోస పెట్టుకుంటున్న ప్రభుత్వం చెర నుంచి రైతులకు విముక్తి రావాలి.
– సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి
తెలంగాణ ఊపిరి మా సదస్సు
పోరాటాలకు పుట్టినిల్లు వరంగల్‌లో బీఆర్‌ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే.. మీది ఏం సదస్సు, ఏం సభ అంటూ వెటకారంగా మాట్లాడారు. మాది తెలంగాణ ఊపిరి సదస్సు. రైతును రాజు చేయాలని, రైతు పక్షపాతి కేసీఆర్.. రైతుబంధు, రైతు భరోసా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పథకాలు తీసుకొచ్చా రు. కానీ, కాంగ్రెస్ సర్కారు వాటిని తుంగలో తొక్కింది.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ


