శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు

ఖిలా వరంగల్‌: రౌడీషీటర్లు శాంతిభద్రతలకు భంగం కలిగించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌ హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలతో మామునూరు సబ్‌ డివిజన్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటేశ్‌ నేతృత్వంలో స్థానిక రౌడీషీటర్లకు శుక్రవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఈస్ట్‌ జోన్‌డీసీపీ అంకిత్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేరప్రవర్తన కలిగిన వ్యక్తులు చట్టబద్ధంగా, సమాజానికి హాని కలగకుండా ప్రవర్తించాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, గొడవలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. చట్టాలను గౌరవిస్తూ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అనుమానాస్పద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలిపారు. తమ పరిసరాల్లో ఎలాంటి నేర ఘటన జరిగినా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఫోన్‌ నంబర్‌, చిరునామా లేదా వ్యక్తిగత వివరాల్లో మార్పులు వచ్చినప్పుడు వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌ యాదవ్‌, జవ్వాజి సురేశ్‌, విశ్వేశ్వర్‌, సంగెం ఎస్సై వంశీ కృష్ణ పాల్గొన్నారు.

రౌడీషీటర్లకు డీసీపీ

అంకిత్‌కుమార్‌ కౌన్సెలింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement