కేటీఆర్‌కు మతిభ్రమించింది | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు మతిభ్రమించింది

May 8 2026 9:50 AM | Updated on May 8 2026 9:50 AM

కేటీఆర్‌కు మతిభ్రమించింది

రామన్నపేట: రైతులకు బేడీలు వేసిన నీచమైన చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీదని, ఇప్పుడు వారిపై ప్రేమ ఉన్నట్లు కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నటిస్తున్నారని కాంగ్రెస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ అయూబ్‌ ఆరోపించారు. వరంగల్‌ నగరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రైతు సంగ్రామ సభలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డిపై పరుష పదజాలంతో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోవడంతో మతిభ్రమించిన కేటీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు వరి వేసుకుంటే ఉరేనని అని అనలేదా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, కేజీ టు పీజీ ఉచిత విద్య పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో 641 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నది వాస్తవం కాదా, ఇలాంటి నీచమైన పరిపాలన చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు.. సీఎం రేవంత్‌రెడ్డిపై పరుష పదజాలం ఉపయోగిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. నాయకులు ఎద్దు సత్యం, తూల రవి, శ్రీనివాస్‌, దాడి శివ, మాధవరెడ్డి, ఇండ్ల రవి, ఈగ దామోదర్‌, నాంపల్లి యాదగిరి, జన్ను అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది

సీఎం రేవంత్‌పై పరుష పదజాలం ఉపయోగిస్తే ఊరుకోం

కాంగ్రెస్‌ వరంగల్‌ జిల్లా

అధ్యక్షుడు మహ్మద్‌ అయూబ్‌

Advertisement
 
Advertisement
Advertisement