అన్నపూర్ణ బేస్‌ క్యాంపును అధిరోహించిన జంట | - | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ బేస్‌ క్యాంపును అధిరోహించిన జంట

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

క్లుప్తంగా

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లా కేంద్రంలోని లోటస్‌కాలనీకి చెందిన అక్షయ్‌–బిందుశ్రీ దంపతులు హిమాలయాల్లోని స ముద్రమట్టానికి 4,130 మీటర్ల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ బేస్‌ క్యాంపునకు చేరుకొని తమ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చే శారు. కాగా, అక్షయ్‌ సీనియర్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌గా,బిందుశ్రీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ప నిచేస్తున్నారు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరి చే వీరు ఈ యాత్రకు సిద్ధమైనట్లు తెలిపారు.

మక్కలు, ధాన్యాన్ని

కొనుగోలు చేయాలి

హన్మకొండ అర్బన్‌: మక్కలు, ధాన్యాన్ని కొ నుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కొ నుగోలు కేంద్రాల్లో రవాణా, హమాలీల సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారని తెలిపారు. గన్నీ సంచుల కొరత కూడా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం సందర్శించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రైతు సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, సారంపల్లి వాసుదేవరెడ్డి, తేలూరి ఉప్పలయ్య, వాంకుడోత్‌ వీరన్న నాయక్‌, మంద సంపత్‌, కాడబోయిన లింగయ్య, దొగ్గల తిరుపతి, గుమ్మ డి రాజుల రాములు, మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య, రమేష్‌, రజిత, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం.రమ, ఉపేందర్‌, దూడపాక రాజేందర్‌, జీడిమట్ల అరుణ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement