హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: స్వీయ జనగణనకు ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందని, జిల్లా ప్రజలంతా తప్పనిసరిగా కుటుంబ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. బాధ్యతగా పాల్గొని ఈ జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ
కార్యదర్శికి స్వాగతం
హన్మకొండ: భారత ప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం శమీరావు, టీఎస్‌ఐఐసీ ఎండీ శశాంకాకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి స్వాగతం పలికారు. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఆదివారం ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వారు హనుమకొండకు వచ్చారు. నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వారికి మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


