నగర సేవలు మరింత మెరుగుపడాలి | - | Sakshi
Sakshi News home page

నగర సేవలు మరింత మెరుగుపడాలి

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

నగర సేవలు మరింత మెరుగుపడాలి

వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ నగర సేవలు మరింత మెరుగుపడాలని హనుమకొండ కలెక్టర్‌, బల్దియా ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌.. అధికారులను ఆదేశించారు. మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలో పారిశుద్ధ్యం, ప్రజాసేవలు, ఆదాయ వనరుల బలోపేతం, వ్యర్థాల నిర్వహణ, వాహనాల వినియోగం, పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత వింగ్‌ అధికారులతో ఆమె సమీక్షించాకరు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వీధి దీపాలు, సెంట్రల్‌ లైటింగ్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధాన రహదారులపై సంచరించే వీధి పశువులను వెంటనే గోశాలలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. మరమ్మతులు చేసిన వాహనాల వినియోగ స్థితి, బయోమైనింగ్‌ పనుల పురోగతి, అక్రమ హోర్డింగ్స్‌ సర్వే, జీఐఎస్‌ సర్వే ప్రతిపాదనలు, స్వీపింగ్‌ యంత్రాల రోజువారీ పనితీరు అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, సీపీ రవీంద్ర రాడేకర్‌, ఉప కమిషనర్లు బి.శ్రీను, సమ్మయ్య, సీహెచ్‌ఓ రమేశ్‌, ఈఈలు రవి కుమార్‌, సంతోశ్‌బాబు, మాధవి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

జనగణను పరిశీలించిన:

జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు

హనుమకొండలోని 28వ డివిజన్‌ పరిధిలో గోవిందరాజుల గుట్ట, సత్యం లేన్‌, స్టేషన్‌ రోడ్‌ ప్రాంతాల్లో జరుగుతున్న జనగణన ఎన్యుమరేషన్‌ ప్రక్రియను హైదరాబాద్‌ జనగణన శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డి. సుబ్బరాజు పరిశీలించారు. ప్రతీ కుటుంబ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు.

‘ఎస్‌ఐఆర్‌’ మ్యాపింగ్‌ వేగంగా పూర్తి చేయండి

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) మ్యాపింగ్‌ ప్రక్రియను వందశాతం పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఎస్‌ఐఆర్‌ పురోగతిపై సోమవారం మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. హనుమకొండ ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌ సింగ్‌, పలు శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌ సెల్‌ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదు

హనుమకొండ కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌

కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement
 
Advertisement
Advertisement