కాశిబుగ్గ: ఎంజీఎంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్ వర్కర్లు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య అన్నారు. మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు అధ్యక్షతన ఆదివారం ఎంజీఎంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకొర వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు తమ పొట్ట గొడుతూ జేబులు నింపుకుంటున్నారని ఆరో పించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంజీఎం హాస్పిటల్ కార్మికులు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గొర్రె నాగరాజు, అధ్యక్షుడిగా విజయ్, ఉపాధ్యక్షులుగా రాజేష్, అరుణ్‌కుమార్, భిక్షపతి, సహాయ కార్యదర్శులుగా లక్ష్మణ్, ఆనందం, శ్రీనివాస్, కమల, కోశాధికారిగా పవన్, రాజవీరు, లలిత, ప్రచార కార్యదర్శులుగా లింగమూర్తి, కరుణ, కిరణ్, సలహాదారులుగా స్వరూప, రమేష్, ఇందిర, సభ్యులను ఎన్నుకున్నారు.


