ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లోని మెట్ల బావిని హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి బుధవారం సందర్శించారు. ఎండ తీవ్రతకు బావి వద్ద ఎండిపోయిన మొక్కలను పరిశీలించారు. రోజు నీళ్లు చల్లాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట బావి పరిరక్షణ కమిటీ సభ్యులు బిల్లా రాజు, పోలెపాక రాజు, తదితరులు ఉన్నారు.
హన్మకొండ: హనుమకొండ గాంధీనగర్‌లో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. గాంధీనగర్ కమ్యూనిటీ హాల్‌లో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నయీంనగర్‌లోని శ్రీశరణ్య ఆస్పత్రి సహకారంతో కిడ్నీ వ్యాధులపై బుధవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయగా, గాంధీనగర్ ప్రముఖుడు ఏవీ.నరసింహారావు హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగార్జున రెడ్డి, సిబ్బంది, గాంధీనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెరువు వెంకటరాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాలవలస వెంకటరమణ, కోశాధికారి మాడిశెట్టి వీరేందర్, ప్రతినిధులు డి.కమలాకర్ రావు, కె.శ్రీనివాసరెడ్డి, కొండ యాదగిరి, మాదాటి రాజిరెడ్డి పాల్గొన్నారు.


