సర్కార్‌ విద్యార్థికి రూ.లక్ష బహుమతి అందజేత | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌ విద్యార్థికి రూ.లక్ష బహుమతి అందజేత

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

సర్కార్‌ విద్యార్థికి రూ.లక్ష బహుమతి అందజేత

హసన్‌పర్తి: ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన హసన్‌పర్తిలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థి ముస్కు ఆదిత్యకు హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆదిత్యకు రూ.లక్ష చెక్కు అందించారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో హసన్‌పర్తిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన ముస్కు ఆదిత్య బీపీసీ విభాగంలో 993 మార్కులు సాధించాడు. బైపీసీలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి 993 మార్కులు సాధించడం ఇంటర్‌ చరిత్రలో మొదటి సారి. ఈసందర్భంగా జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి గోపాల్‌, ప్రిన్సిపాల్‌ సునీతను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంతటి ప్రతిభ కనబర్చచడం గర్వకారణమని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement