రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి
దాసరి హరిచందన
హన్మకొండ అర్బన్: వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, అటవీ అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపర్చడంలో మాక్ డ్రిల్స్ కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి దాసరి హరిచందన అన్నారు. టేబుల్‌టాప్ ఎక్సర్సైజ్కు సంబంధించి పలు జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగంతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రిటైర్డ్ మేజర్ జనరల్ సుధీర్ బాహల్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈసందర్భంగా దాసరి హరిచందన మాట్లాడుతూ.. ఈనెల 18న రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఎడీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల పాత్రలు, బాధ్యతలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.


