ప్రభుత్వంతో మక్కలు కొనిపిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంతో మక్కలు కొనిపిస్తాం..

May 6 2026 7:37 AM | Updated on May 6 2026 7:37 AM

ప్రభుత్వంతో మక్కలు కొనిపిస్తాం..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నర్సంపేట/గీసుకొండ: రైతులు పండించిన మక్కలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతో కొనిపిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్పష్టం చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌, గీసుకొండ మండలం ఊకల్‌లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. నర్సంపేట మార్కెట్‌లో పర్శనాయక్‌తండాకు చెందిన మహిళా రైతు చెప్పిన మాటలు విని ఆశ్చర్యానికి గురయ్యారు. మక్కలు మార్కెట్‌కు తీసుకువచ్చిన నాటి నుంచి ప్రతీ పైసా తమ నుంచే వసూలు చేస్తున్నారని కేటీఆర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో రైతులు పండించిన ప్రతీ గింజను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే 25 క్వింటాళ్లే కొంటామని నిబంధనలు పెట్టడం ఎంతవరకు సమంజసమని. మిగిలిన వాటిని ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. రైతులు అధైర్య పడవద్దని, కేసీఆర్‌ పంపితే తాను వచ్చానని, మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, నాయకులు పెద్ది స్వప్న, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, చింతం సదానందం, గోలి రాజయ్య, పోలీసు ధర్మారావు, దొంగల రమేశ్‌, జక్కు మురళి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గుర్రం రఘు, సిరిసె శ్రీకాంత్‌, చల్లా వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్‌ బోడకుంట్ల ప్రకాశ్‌, అజర్‌మున్నా, అంకతి నాగేశ్వర్‌రావు, రాయిడి రవీందర్‌రెడ్డి, నాడెం శాంతికుమార్‌, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement