రాజస్థాన్‌లో పేపర్ లీకై ందని నిర్ధారణ కావడంతో నీట్(యూజీ) పరీక్షను ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. నీట్ పరీక్ష కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. పరీక్ష బాగా రాశా. ఎక్కడో పేపర్ లీక్ అయిందనే సాకుతో నీట్ పరీక్షను రద్దు చేయడం బాధాకరం. ఇలాంటి ఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలి.
– వంగపండ్ల గౌతమి, స్టేషన్ ఘన్పూర్
చివరికి నిరాశే మిగిలింది..
ఎంతో కష్టపడి నీట్–26 ఎంట్రన్స్ పరీక్ష రాస్తే నిరాశే మిగిలింది. ఇంటర్మీడియెట్‌లో అధిక మార్కులు సాధించి, నీట్ పరీక్ష కోసం సమయాన్ని వృథా చేయకుండా చదివాను. ఎక్కువ మార్కులు తెచ్చుకుని పేదలకు సేవ చేసే డాక్టర్ కోర్సు చదువుకోవాలనేది నా లక్ష్యం. రాజస్థాన్‌లో పేపర్ లీక్ అవడంతో మా ఆశలు నీరుగారాయి. మళ్లీ పరీక్ష రాస్తే గతంలో మాదిరిగా రాస్తామో, లేదోనని ఆందోళన చెందాల్సి వస్తోంది.
– జోగు రక్షిత, వరంగల్
పేపర్‌లీక్.. అభ్యర్థులకు శాపమే..
నీట్ పేపర్ లీక్‌కావడం, ఎన్టీఏ నీట్‌ను రద్దు చేయడంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు శాపంగా మారింది. నేను ఇంటర్ బైపీసీలో 1,000 మార్కులకు 984 మార్కులు సాధించా. నీట్‌కు ప్రిపేర్ అయి పరీక్ష బాగా రాశాను. మంచి మార్కులు సాధించి సీటు వస్తుందనే భావనతో ఉన్నా. పేపర్ లీకై ందని పరీక్ష రద్దు చేశారనడంతో కంగుతిన్నా. మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మళ్లీ ప్రశ్నపత్రం ఎలా వస్తుందో తెలియదు. – ఎం.రిషిత, పున్నేలు, ఐనవోలు


