దేవుడంటే రేవంత్‌రెడ్డికి లెక్కలేదు | - | Sakshi
Sakshi News home page

దేవుడంటే రేవంత్‌రెడ్డికి లెక్కలేదు

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

ఖానాపురం: దేవుడు, బడులంటే సీఎం రేవంత్‌రెడ్డికి లెక్కలేదని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. వ రంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో కూల్చివేసిన శివాలయాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, ఆలయం వద్ద 24 ఫీట్ల లోతు తవ్వి పూడ్చివేయడంలో కారణం ఏంటన్నారు. ఆర్కియాలజీ అధికారులు ఈనెల 7న ఫిర్యాదు చేస్తే కలెక్టర్‌ ఎందుకు కేసులు నమోదు చేయించడం లేదని ప్రశ్నించారు. గుప్తనిధుల కోస మే సీఎం రేంవత్‌రెడ్డి తవ్వకాలు జరిపించారని ఆరో పించారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను అశోక్‌నగర్‌కు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ దేవాలయాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తే సీఎం రేవంత్‌రెడ్డి కూల్చివేస్తున్నాడని ఎద్దేవా చేశారు.రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసి మాటతప్పిన వారిలో దేశంలో తొలిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అనేక పా పాలు చేస్తున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కూల్చివేతపై కలెక్టర్‌ ఎందుకు నోరు విప్పడం లేదని, కూల్చివేతపై కాంగ్రెస్‌ పెద్దల్లో భయం పుట్టుకుందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, అరూరి రమేశ్‌, శంకర్‌నాయక్‌, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రో ళ్ల శ్రీనివాస్‌, మర్రి యాదవరెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, ఓడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌, నియోజకవర్గ కన్వీనర్‌ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీపీ ప్రకాశ్‌రావు, సర్పంచ్‌ రమేశ్‌, నాయకులు వి ద్యాసాగర్‌రెడ్డి, కిషన్‌రావు, రాజశేఖర్‌, శ్రీనివాస్‌, వెంకటనారాయణ, కోటేశ్వర్‌రావు, వెంకటనర్స య్య, సంపత్‌, రాజు, దేవేందర్‌రావు పాల్గొన్నారు.

శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement