కాళోజీ సెంటర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత అందేకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డు అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతు ల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. డాక్టర్ శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు.


