రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

న్యూశాయంపేట: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలించిన వెంటనే రశీదులు ఇవ్వాలని పేర్కొన్నారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్‌ నుంచి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఆర్డీఓ నాగపద్మజ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement