రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రామకృష్ణారావు
హన్మకొండ అర్బన్: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, స్వీయ జనగణన, విద్యా వారోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొని జిల్లాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హనుమకొండ నుంచి అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్డీఓ మేన శ్రీను, డీసీఓ సంజీవ్‌రెడ్డి, వరంగల్ నుంచి అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో తెలంగాణ పారా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గాడిపెల్లి ప్రశాంత్ అధ్యక్షతన శనివారం జరిగిన దివ్యాంగ క్రీడాకారుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ముప్పిడి రాజుకుమార్, సలహాదారుగా సింగారపు బాబు, ప్రెసిడెంట్‌గా నిషా ఇన్ననీ, నిర్వహణ కార్యదర్శిగా సీవీ జగన్నాథరావు, వైస్ ప్రెసిడెంట్లుగా బొట్ల కార్తీక్, దామెర మనీందర్, కోశాధికారిగా బల్లె రాజు, కార్యవర్గ సభ్యులుగా కృష్ణవేణి, జ్యోతి రఘువరన్, ప్రశాంత్, సంతోష్ ఎన్నికై నట్లు ప్రశాంత్ తెలిపారు. తమకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, పారా ఒలింపిక్స్ కమిటీ, ఖేలో ఇండియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దరఖాస్తుల స్వీకరణ
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
హసన్‌పర్తి: ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌కు చెందిన చల్లా బతుకయ్య(42), లక్ష్మి (39) దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితం హసన్‌పర్తికి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడే షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శనివారం సాయంత్రం వారు బైక్‌పై హసన్‌పర్తి నుంచి హనుమకొండ వైపు బయల్దేరారు. హసన్‌పర్తి సెంటర్ నుంచి అరకిలో మీటరు దూరంలోని 10 రూపాయల టిఫెన్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈఘటనలో బతుకయ్య పైనుంచి లారీ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన లక్ష్మిని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. బతుకయ్య హెల్మెట్ ధరించినా ప్రాణాపాయం తప్పలేదు.


