సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్న లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. చిన్నప్పటి నుంచి బాగా చదివి ఉద్యోగం సాధించాలని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించా. నన్ను చూసి మా అన్నదమ్ములు, అక్కా చెళ్లెళ్లు అందరూ బాగా చదివి మంచి పొజీషన్‌లో ఉన్నారు. నాన్న చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి అమ్మ మాతోనే ఉంటోంది. ఇప్పటికీ అమ్మతో మంచీ చెడు అన్నీ పంచుకుంటాం. అమ్మ నింపిన ధైర్యమే నా ఉద్యోగం.
– ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్


