‘కారుణ్య’ దరఖాస్తుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

‘కారుణ్య’ దరఖాస్తుల పరిశీలన

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

‘కారుణ్య’ దరఖాస్తుల పరిశీలన వేయిస్తంభాల ఆలయంలో మాసశివరాత్రి పూజలు

వరంగల్‌ అర్బన్‌ : బల్దియా పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల కారుణ్య నియామకాల కమిటీ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్‌, ఈఈ మహేందర్‌, రాజేశ్‌ పాల్గొన్నారు. కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. మొత్తం 42 దరఖాస్తులను పరిశీలించగా, అందులో 34 మంది అ భ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపా రు. మిగతా దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు వెల్లడించారు.

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరీదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు. కాగా, నేడు శనివారం వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఉపేంద్రశర్మ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement