అక్రమంగా గోవధ, మాంస విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా గోవధ, మాంస విక్రయాలు

May 15 2026 9:50 AM | Updated on May 15 2026 9:50 AM

నయీంనగర్‌: గ్రేటర్‌ వరంగల్‌ మహానగర పరిధిలో బక్రీద్‌ పండుగ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ గోవధపై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హనుమకొండ ప్రెస్‌ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వీహెచ్‌పీ వరంగల్‌ మహానగర్‌ అధ్యక్షుడు కేసీరెడ్డి జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ అక్రమ గోవధ, నిబంధనలకు విరుద్ధంగా మాంస విక్రయాలపై అధికారులు నిర్లక్ష్యం వహించడం అత్యంత దారుణమన్నారు. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోమాతను బహిరంగంగా వధిస్తూ హిందూ సమాజాన్ని రెచ్చగొడుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా గోమాంసాన్ని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నగరవ్యాప్తంగా గోమాంసాన్ని అమ్మే షాపులను వెంటనే కూల్చివేయాలని సూచించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు తోకల ఓంకుమార్‌, నాగరాజ నంగునూరి, దేవేందర్‌ రెడ్డి, శ్రీరామ రాకేష్‌, గండి నాగరాజు, శెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement