బండి సంజయ్‌పై రాజకీయ కుట్ర | - | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌పై రాజకీయ కుట్ర

May 15 2026 9:50 AM | Updated on May 15 2026 9:50 AM

భీమదేవరపల్లి : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్‌ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. రెండున్నర ఏళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలపై చేస్తున్న అరాచకాలు, సమస్యలపై ఒక్కసారి కూడా స్పందించని బీఆర్‌ఎస్‌ నాయకులు, ఇప్పుడు ఆధారాలు లేని కేసులు ముందుకు తెచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్‌ చేస్తున్నట్లు ఆరోపించారు. గత పదేళ్లుగా మాజీ సీఎం కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రశ్నించినందుకే బీఆర్‌ఎస్‌ నాయకులు బండి సంజయ్‌పై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు కొమురయ్య, పృథ్వీరాజ్‌, రాణాప్రతాప్‌, మల్లారెడ్డి, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement