బల్దియాలో బదిలీలు | - | Sakshi
Sakshi News home page

బల్దియాలో బదిలీలు

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

బల్దియాలో బదిలీలు

వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ హనుమకొండ కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా కమిషనర్‌ సీసీగా పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ మహ్మద్‌ సమద్‌ను కాశిబుగ్గ సర్కిల్‌ జీ1 సెక్షన్‌కు, వార్డు ఆఫీసర్‌ వి. సాయికుమార్‌ను సీసీగా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న కె. సర్జన్‌ రాజుకు ఏ3 సెక్షన్‌, ఇక్కడ పనిచేస్తున్న వి.సునీల్‌ కుమార్‌ ఖమ్మం కార్పొరేషన్‌కు, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రవణ్‌ కుమార్‌కు కాశిబుగ్గ సర్కిల్‌ ఆర్‌టీఐ సెక్షన్‌కు, జూనియర్‌ అసిస్టెంట్‌ రతన్‌ సింగ్‌కు బల్దియా ఈ1 సెక్షన్‌కు, ఏ3 సెక్షన్‌ రామకృష్ణను 65వ డివిజన్‌ వార్డు ఆఫీసర్‌గా, ఆర్‌.భాస్కర్‌ను 20వ డివిజన్‌ వార్డు ఆఫీసర్‌గా స్థానం చలనం కల్పించారు. కె. నాగశ్రీని 20వ డివిజన్‌ వార్డు ఆఫీసర్‌గా, మేయర్‌ సీసీగా పనిచేసిన భరత్‌ కుమార్‌ను హెడ్‌ ఆఫీస్‌ టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌కు స్థానం చలనం కలిగింది. వార్డు ఆఫీసర్‌ విద్యాసాగర్‌ను 45వ డివిజన్‌కు, మేయర్‌ అటెండర్‌ కె.రమేష్‌ను బల్దియా ప్రధాన కార్యాలయానికి, శ్రీనాథ్‌ను డిప్యూటీ కమిషనర్‌ అడ్మిన్‌కు అటెండర్‌గా బదిలీ చేశారు.

వార్డు ఆఫీసర్‌ సస్పెన్షన్‌

ఆస్తి, నీటి చార్జీల వసూళ్లల్లో నిర్లక్ష్యం.. సమాచారం లేకుండా విధులకు హాజరు కానీ బల్దియా కాశిబుగ్గ సర్కిల్‌కు చెందిన వార్డు ఆఫీసర్‌ కంజర్ల ప్రశాంత్‌ను సస్పెండ్‌ చేస్తూ హనుమకొండ కలెక్టర్‌, బల్దియా ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశాలు జారీ చేశారు. పురపాలక శాఖ రూల్‌ (1) సీసీఏ రూల్స్‌ వర్తిస్తాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement