వరంగల్ చౌరస్తా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్‌ల ప్రతులను హంటర్ రోడ్డులో ఏఐసీటీయూ వరంగల్ జిల్లా గుమాస్తాల సంఘం ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐసీటీయూ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్ర ప్రతాప్ మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో యాకయ్య, బాబురావు, జగదీశ్వర్, రాజశేఖర్, శ్రీరాములు, రాధాకృష్ణ, వేణు, ఎల్ల య్య, ఎం.రమేష్, డి.రమేష్, ప్రసాద్ పాల్గొన్నారు.


