వరంగల్ చౌరస్తా: దేశంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ చౌరస్తాలో బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమికి రమేష్‌బాబు, మాజీ కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, కుందారపు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
రాజీనామా చేస్తేనే పారదర్శకంగా కేసు విచారణ
హన్మకొండ: బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే బండి భగీరథ్ కేసు విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు దాస్యం విజయ్ భాస్కర్, నరెడ్ల శ్రీధర్, కుమార్, పానుగంటి శ్రీధర్, గండ్రకోట రాకేష్ యాదవ్, ప్రశాంత్, రాజేందర్, గువ్వ రాజేష్, సుమన్, వంశీ పాల్గొన్నారు.
బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి
వరంగల్ చౌరస్తా: బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ వద్ద బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి భవాని, జిల్లా ఉపాధ్యక్షురాలు చిట్యాల సువర్ణ, జిల్లా సహాయ కార్యదర్శి సింగారం విక్టోరియా, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆరెల్లి రవి, దామెర కృష్ణ పాల్గొన్నారు.
కఠినంగా శిక్షించాలి
కాశిబుగ్గ: బండి సాయి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలని 13వ డివిజన్ ఎంహెచ్ నగర్‌లోని మహిళలు డిమాండ్ చేశారు. సీపీఎం కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి మహమ్మద్ బషీర్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తాళ్లపల్లి స్వామి, జూపాక రాజు, దూరం సంపత్, సాంబయ్య, ఉడుత సుజాత, సునీత, మంగ, స్వరూప, అక్తర్, కావ్య పాల్గొన్నారు.


