హన్మకొండ / కాశిబుగ్గ: హోప్‌ఫుల్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని పీఎంఎస్‌ఎస్‌వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అత్యాధునిక 250 ఎల్‌పీహెచ్ వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్‌ను ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలు, దివ్యాంగులు, వృద్ధులు, అనాథ ఆశ్రమాలకు విద్యుత్ ఉద్యోగులు చేయూత అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. కాకతీయ మెడికల్ కళాశాల ప్రినిపాల్ డాక్టర్ సంధ్యారాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి, పీఎంఎస్‌ఎస్‌వై సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ మురళి, పీడియాట్రిక్ సర్జరీ హెచ్‌ఓడీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ బాలరాజ్, ఆర్‌ఎంఓ డాక్టర్ ప్రతాప్ కల్లోగి, టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, పి.మధుసూదన్, సి.ప్రభాకర్, హోప్‌ఫుల్ హార్ట్స్ సొసైటీ చైర్మన్ కేవీ.జాన్సన్, కార్యదర్శి ఫాతిమా రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.


