హజ్‌ యాత్రికులు క్షేమంగా వెళ్లి రావాలి | - | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికులు క్షేమంగా వెళ్లి రావాలి

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

హజ్‌ యాత్రికులు క్షేమంగా వెళ్లి రావాలి

ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

హన్మకొండ చౌరస్తా: యాత్రికులు క్షేమంగా హజ్‌ యాత్రకు వెళ్లి రావాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవా రం హైదరాబాద్‌లోని హజ్‌ హౌస్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి హజ్‌ యాత్రకు వెళ్తున్న బస్సును ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలని ప్రార్థించాలని భక్తులను కోరారు. కార్యక్రమంలో హజ్‌ కమిటీ చైర్మన్‌, కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రు పాషా, అజ్మతుల్ల, అబూబకర్‌, ము స్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

కన్నాయిగూడెం: మావోయిస్టు ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మావోయిస్టు బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని బుట్టాయిగూడేకి విచ్చేసి గ్రామస్తులతో మాట్లాడారు. ఇంతకాలం అడవిలో ఉండి ప్రజల కోసం పనిచేసిన తాను ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో తనకు పరిచయం ఉన్న కుటుంబాలు, అమరు ల కుటుంబాల ను పరామర్శించి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement