● ఎస్సై అశోక్
దామెర : పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని ఎస్సై కొంక అశోక్ రైతులకు సూచించారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం మూలంగా పొగ గాలిలో కలిసి వాతావరణం కాలుషితం అవుతుందన్నారు. అదే విధంగా రహదారులపైకి పోగరావడం మూలంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయన్నారు. వ్యర్థాలను కాల్చే సమయంలో ఇతర పంటలకు మంటలు వ్యాప్తించే ప్రమాదం ఉంటుందని అన్నారు. అదే విధంగా విద్యుత్ వైర్లు, పైపులు, మోటర్లు కాలిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు.


