హన్మకొండ: తిట్ల పురాణానికి ఆద్యుడు రేవంత్‌రెడ్డి అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించడం లేదని, పంటల కొనుగోళ్లు లేక రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. రైతు బంధు వంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు మంత్రి పదవులు కోసం పోటీ పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హామీల అమలుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు అసహనంగా స్పందిస్తున్నారన్నారు. రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతు సంగ్రామ సదస్సు విజయవంతం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారని, పంటలు కొనుగోలు చేసే సామర్థ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, ఉడతల సారంగపాణి, తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, రామ్మూర్తి, నార్లగిరి రమేశ్, నయీముద్దీన్, పానుగంటి శ్రీధర్, బండి రజినీకుమార్, రవీందర్‌రావు పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని పండుగలా
మార్చింది కేసీఆర్
మాజీ ఉప ముఖ్యమంత్రి
తాటికొండ రాజయ్య


