హనుమకొండ, వరంగల్‌ జిల్లాలను కలపాలి | - | Sakshi
Sakshi News home page

హనుమకొండ, వరంగల్‌ జిల్లాలను కలపాలి

May 9 2026 8:14 AM | Updated on May 9 2026 8:14 AM

నయీంనగర్‌: హనుమకొండ, వరంగల్‌ జిల్లాలను కలపాలని, ప్రజలకు బతుకుదెరువు అవకాశాలు కల్పించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. శుక్రవారం హనుమకొండలోని గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన టీజేఎస్‌ ఉమ్మడి జిల్లా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. టీజేఎస్‌ ఏర్పాటునుంచి ఉద్యోగ, నిరుద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిందన్నారు. ప్రజా అవసరాలకు తగ్గట్టు పాలన జరగాలని, రియల్‌ ఎస్టేట్‌కు ప్రాధాన్యత తగ్గించుకోవాలని అన్నారు. ఉద్యోగులకు పెన్షన్‌ డబ్బులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌ రెడ్డి నియమించాలని కోరారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో పార్టీ పార్టీ 4వ ప్లీనరీ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసితులకు, ఎయిర్‌పోర్ట్‌ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని, ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్షులు చిల్ల రాజేంద్రప్రసాద్‌, షేక్‌ జావిద్‌, నాయకులు రత్నం కిరన్‌, శివకుమార్‌, రాజేష్‌, బోనగాని రవీందర్‌, చిల్లా శ్రవన్‌కుమార్‌, సంధాని, మల్లేశం, రాధా కిషన్‌, రాజేష్‌, శివకుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రొఫెసర్‌ కోదండరాం

Advertisement
 
Advertisement
Advertisement