● అదనపు డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్ రావు
రామన్నపేట : తలసేమియా వ్యాధిపై, స్వచ్ఛంద రక్తదాన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని హనుమకొండ అదనపు డీఎంహెచ్‌ఓ టి.మదన్‌మోహన్ రావు సూచించారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అవగాహన కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో బ్లడ్ బ్యాంక్, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మానవహారం నిర్వహించి అవగాహన కల్పించారు. బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ నిఖిల, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుబీనా అప్రోజ్, వైద్యాధికారి అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి ఎల్.చంద్రశేఖర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రేమలత, రామేశ్వరి,విప్లవ కుమార్, పద్మజ, జ్యోతి, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.


