కాజీపేట: కాజీపేట పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎండి.సోని (60) బుధవారం మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో పోలీసుల లాఠీ దెబ్బలతో పాటు పలు పోలీసు కేసులు నమోదు కాగా, జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. కొద్దిరోజులుగా అస్వస్థతకు గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సోని మృతి చెందారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌కు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న సోని మృతితో పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా సోనీ పార్థివ దేహాన్ని పలువురు బుధవారం సందర్శించి నివాళులర్పించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
హసన్‌పర్తి: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ హెచ్చరించారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధి లోని రౌడీ షీటర్లకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవి రుద్ధ పనులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఎస్సై దేవేందర్, రవి పాల్గొన్నారు.


