100కు డయల్‌ చేస్తే తక్షణ సాయం | - | Sakshi
Sakshi News home page

100కు డయల్‌ చేస్తే తక్షణ సాయం

May 17 2026 12:36 AM | Updated on May 17 2026 12:36 AM

100కు డయల్‌ చేస్తే తక్షణ సాయం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

హసన్‌పర్తి: ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 100కు డయల్‌ చేస్తే తక్షణ సాయం అందుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. జాగృతి పోలీస్‌ కళాబృందం హసన్‌పర్తిలో శనివారం కళాజాత ప్రదర్శన నిర్వహించింది. కార్యక్రమానికి కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తొలుత కల్లుకు అలవాటు పడి మెల్లమెల్లగా డ్రగ్స్‌ తీసుకునే స్థాయి వరకు చేరుతారని పేర్కొన్నారు. తప్పిదాలతోనే సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని, సైబర్‌ నేరాలకు గురెతే 1930కు డయల్‌ చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇంటర్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ఆదిత్యను శాలువాతో సత్కరించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌, ఎస్సై దేవేందర్‌, రవి, డాక్టర్‌ తహసిద్‌, డాక్టర్‌ ప్రశాంత్‌, డాక్టర్‌ భార్గవ్‌, నాయకులు పావుశెట్టి శ్రీధర్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement