వాళ్ల ఇష్టం వచ్చినసమయానికి నీళ్లు వదులుతున్నారు. ఒక్కోసారి ఉదయం, మరోసారి రాత్రిపూట వదలడంతో తెలియక పట్టుకోలేకపోతున్నాం. గతంలోకంటే ఎండాకాలం నీరు తక్కువగా వస్తోంది. లైన్‌మన్‌ను అడిగితే పైప్‌లైన్ లీకేజీ ఉందని, అందుకే నీరు ప్రెషర్ తక్కువగా ఉందని చెబుతున్నాడు. – పిల్లల సామ్రాజ్యం, ఉర్సుబొడ్రాయి
నల్లా వత్తలేదు
నల్లా రాక, తాగు నీరు లేక బాగా ఇబ్బందవుతోంది. మాకు బోరు లేదు. నల్లా వత్తలేదు ఇలా అయితే ఎలా? ఇంటిల్లిపాదికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎండా కాలంలో నీళ్లు లేకుండా ఎలా ఉండగలం? క్యాన్ వాటర్ తాగేందుకు కొంటాం. కానీ ఇంటి అవసరాలకు ట్యాంకర్ కొనలేం కదా. – కూచన రాధ,
54వ డివిజన్, హనుమకొండ
రోజంతా నీళ్లకాడనే..
నల్లా నీరు ప్రెషర్ తక్కువగా వస్తోంది. సన్నటి ధారలా వస్తుండడంతో రోజంతా నీళ్లకాడనే ఉండాల్సి వస్తోంది. మేం పనికి వెళ్తేనే కుటుంబం గడుస్తుంది. నీటిదగ్గరే సమయమంతా గడిచిపోవడంతో పనికి పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. దీంతోపాటు ఏ సమయంలో నీటిని వదులుతారో అర్థంకాని పరిస్థితి.
– భాగ్యమ్మ మైసయ్య నగర్


