ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి పనులపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి పనులపై సమీక్ష

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి పనులపై సమీక్ష

న్యూశాయంపేట: మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులపై వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన మౌలిక వసతులు, రహదారి, విద్యుత్‌ తదితర అంశాలపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్‌ ఆర్డీఓ సుమ, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్‌, ఎయిర్‌పోర్ట్‌ అధికారి నటరాజ్‌, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ ఆనందం, అధికారులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి

మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కాకుండా మద్దతు ధర అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,457 మంది రైతుల నుంచి రూ.213.45 కోట్ల విలువైన 88,937.20 మెట్రిక్‌ టన్నుల మక్కలు కొనుగోలు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement