ఆలయ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆలయ అభివృద్ధికి కృషి

May 10 2026 7:28 AM | Updated on May 10 2026 7:28 AM

ఆలయ అభివృద్ధికి కృషి డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి

కాశిబుగ్గ: వరంగల్‌ ఓసిటీ కాశిబుగ్గలోని శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయంలో కల్యాణ మండపం నిర్మిస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం సీతారామాంజనేయ హరి హర పుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో హనుమాన్‌ స్వాములకు ప్రత్యేక భిక్ష ఏర్పాటు చేశారు. నాయకులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్‌, దాసరి రాజేశ్‌ పాల్గొన్నారు.

హన్మకొండ: పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మహేందర్‌ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి.శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని అసోిసియేషన్‌ ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించారు. అనంతరం మంత్రిని సన్మానించారు. డాక్టర్లు వెంకటేశ్‌, శివశంకర్‌, అనుపచంద్‌, ఆశాజ్యోతి, స్వప్న, సంగీత, సుష్మ, భార్గవి, ప్రియాంక పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement