సెలవులు వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

సెలవులు వినియోగించుకోండి

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

సెలవులు వినియోగించుకోండి

హనుమకొండ డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌

హసన్‌పర్తి: విద్యార్థులు వేసవి సెలవులు వినియోగించుకోవాలని డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ అన్నారు. హసన్‌పర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి గిరిరాజ్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11 నుంచి ఈనెల 25వ తేదీ వరకు శిక్షణ శిబిరం కొనసాగుతుందని, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, వర్క్‌ ఎడ్యుకేషన్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, కోడింగ్‌, ఆటలు, ఫన్‌ గేమ్స్‌ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమాదేవి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌, ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ మహేశ్‌, ఏఎంఓ మన్మోహన్‌, కళాశాల అభివృద్ధి కమిటీ కోశాధికారి చకిలం రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కేజీవీవీలో...

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ప్రత్యేక వేసవి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌, కో–ఆర్డినేటర్‌ సునీత, స్పెషల్‌ ఆఫీసర్‌ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

వేసవి సెలవులను వృథా చేయొద్దు: డీవైఎస్‌ఓ

వరంగల్‌ స్పోర్ట్స్‌: విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేయకుండా ఇష్టమైన క్రీడల్లో శిక్షణ పొందాలని హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కాజీపేట మండలం సోమిడిలో నిర్వహిస్తున్న తైక్వాండో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సోమవారం డీవైఎస్‌ఓ ప్రశాంత్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇదొక చక్కటి అవకాశమని పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తే ఆరోగ్యంతోపాటు సాధించాలన్న ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. డీఎస్‌ఏ కోచ్‌లు కూరపాటి రమేశ్‌, రాయబారపు నవీన్‌, తైక్వాండో కోచ్‌ మోహన్‌లాల్‌, డీఎస్‌ఏ సిబ్బంది దుబాసి కిశోర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement