బాస్కెట్‌ బాల్‌ కేరాఫ్‌ మానుకోట.. | - | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌ బాల్‌ కేరాఫ్‌ మానుకోట..

May 15 2026 9:50 AM | Updated on May 15 2026 9:50 AM

మహబూబాబాద్‌ : మానుకోట క్రీడలకు పుట్టినిల్లు. బాస్కెట్‌ బాల్‌, ఖోఖో క్రీడలకు కేరాఫ్‌. ఇందులో ప్రధానంగా బాస్కెట్‌ క్రీడలో వేలాది మంది రాణిస్తున్నారు. దీనికి కారణం సుమారు 65 సంవత్సరా లుగా ఒకే ప్రాంగణంలో ప్రతీ రోజు శిక్షణ ఇవ్వడ మే. అయితే సమ్మర్‌ మాత్రం ప్రత్యేకంగా క్యాంపులా నిర్వహించి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. బాస్కె ట్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరంలో ఆ క్రీడ నేర్చుకోవడానికి విద్యార్థులు ఆ సక్తి చూపుతున్నారు. అందుకు ప్రధాన కారణం స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు ఉండడం, మెడిసిన్‌లో సీట్లు సాధించి పూర్తి చేసిన వారు ఉండడమే.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని బాస్కెట్‌ బాల్‌ కోర్టులో సుమారు 65 సంవత్సరాలుగా ఈ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. అలాగే, కరాటే, తైక్వాండో క్రీడలపై కూడా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ వేసవిలో క్రికెట్‌లో శిక్షణ ఇస్తున్నారు.

వేల సంఖ్యలో రాష్ట్ర స్థాయి క్రీడాకారులు

అంతర్జాతీయ స్థాయిలో కొద్ది మంది మాత్రమే ఉండగా జాతీయ స్థాయిలో సుమారు 450 క్రీడాకారులు మంది ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో మాత్రం 2వేలకుపైగా ఉన్నారని కోచ్‌ వెలిశాల కుమారస్వామి తెలిపారు. ఈ క్రీడ ద్వారా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం పొందిన వారు సుమారు 40 మంది ఉన్నారు. వీరిలో కొందరు వారానికి ఒక్క రోజైన ఆ కోర్టుకు వచ్చి ప్రాక్టీస్‌ చేస్తారు.

సమ్మర్‌లో వంద మందికి పైగా శిక్షణ

ఈ వేసవిలో ఉదయం 5:30 నుంచి ఉదయం 8:30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వ రకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో వందమందికి పైగా శిక్షణ పొందుతున్నారు. ముందుగా వాకింగ్‌, వ్యాయాయం చేయించి ఆ తర్వాత బాల్‌తో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. బాల్స్‌, ఇతర పరికరాలు వారే ఉచితంగా ఇస్తున్నారు. 65 సంవత్సరాలుగా ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు.

30 సంవత్సరాలుగా కోచ్‌ కుమారస్వామి

బాస్కెట్‌ బాల్‌ కోర్టులో సుమారు 30ఏళ్లులుగా కో చ్‌ కుమారస్వామి ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వేతనం లేకున్నా రోజూ ఉదయం, సాయంత్రం కోర్టుకు వచ్చి క్రీడాకారులకు మెళకువలు నేర్పిస్తున్నారు. సీనియర్‌ క్రీడాకారులు సుజిత్‌, గోగుల యాకయ్య రోజూ బాస్కెట్‌ బాల్‌ కోర్టుకు వచ్చి క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ కోచ్‌కు సపోర్టుగా ఉంటున్నారు.

జాతీయ స్థాయిలో రాణిస్తున్న

అండర్‌– 14 విభాగంలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న. బాస్కెట్‌ బాల్‌లో మంచి శిక్షణ ఇవ్వడం వల్లే నేను జాతీయ స్థాయికి ఎదిుగా. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే నా తపన.

–జి. విశ్వతేజ్‌

ప్రభుత్వం చేయూతనివ్వాలి

ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనిచ్చి ప్రోత్సహించాలి. కోర్టులు, ఇతరత్రా ఆట స్థలాల విషయంలో నిధులు కేటాయించి క్రీడల అభివృద్ధికి కృషి చేయాలి. 65 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం బాస్కెట్‌బాల్‌ కోర్టు ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి అందులో సౌకర్యాలు కల్పించాలి. కోచ్‌లను కూడా గుర్తించాలి.

–వెలిశాల కుమారస్వామి, కోచ్‌

రాష్ట్ర స్థాయిలో రాణించా

రాష్ట్ర స్థాయిలో నాలుగు టోర్నమెంట్‌లో ఆడా. క్రీడతో మంచి గుర్తింపు వచ్చింది. పలు సర్టిఫికెట్లు వచ్చాయి. హ్యపీగా ఉంది. పాఠశాల వేళల్లో కాకుండా మిగతా సమయంలో మాత్రమే ఆడుతున్నా.

– సీహెచ్‌. పునీత్‌

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుస్తున్న క్రీడాకారులు

ఈ క్రీడలో సుమారు

65 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ

ఉదయం, సాయంత్రం

వేళల్లో తర్ఫీదు

ఆసక్తి చూపుతున్న విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement