వరంగల్ డీఎఫ్‌ఓ నిఖిత
న్యూశాయంపేట: జిల్లాలో అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారి బి.నిఖిత అన్నారు. ఇటీవల జిల్లా అటవీశాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బుధవారం ఆమె క్యాంపు కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారుల (ఎఫ్‌ఆర్‌ఓ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అటవీ చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు రవికిరణ్, రాధిక తదితరులు పాల్గొన్నారు.


