వరంగల్ కలెక్టర్ సత్యశారద
కాళోజీ సెంటర్: పదో తరగతిలో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే స్పెషల్ రెమీడియల్ సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ నరేంద్రనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సంపేట బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన క్యాంపులను కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ జూన్ మూడో తేదీ వరకు ప్రతీ రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటల తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. మొదటి రోజు గీసుకొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల నుంచి 70 మంది విద్యార్థులు నరేంద్రనగర్ పాఠశాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ, డీడబ్ల్యూఓ రాజమణి, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఈఓ, జీహెచ్‌ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులున్నారు.


