వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో మక్కల కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో శనివారం నాటికి 69,140 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలనే లక్ష్యం కాగా, అందులో 51,302 మెట్రిక్ టన్నులను గోదాంలలో నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వైవీ.గణేశ్, అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి..
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భాగంగా.. ఎడ్యుకేషన్ వారోత్సవాలు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
స్వీయగణనను వినియోగించుకోవాలి..
కాశిబుగ్గ: జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ద్వారా స్వీయ జనగణనను (సెల్ప్ ఎన్యుమరేషన్) సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్ నుంచి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎంఏ హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సీపీఓ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.


